మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. రైతులకు ఉచితంగా ట్రాక్టర్స్!

May 3, 2024

మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. రైతులకు ఉచితంగా ట్రాక్టర్స్!

సినీ ఇండస్ట్రీలో హీరోగా స్వయంకృషితో ఉన్నత స్థాయికి చేరుకొని ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి వారిలో నటుడు రాఘవ లారెన్స్ ఒకరు. కొరియోగ్రాఫర్ గా మొదలైనటువంటి తన ప్రయాణం అనంతరం నటుడిగా కొనసాగారు. అదేవిధంగా ప్రస్తుతం దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసినదే. ఇలా నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి లారెన్స్ తన పేరు మీదట ట్రస్ట్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా ట్రస్టు ద్వారా ఈయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఎంతోమంది పేద పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడమే కాకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అలాగే ఎంతో మంది వృద్ధులను కూడా చేరదీస్తున్నారు ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో భాగమై మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి లారెన్స్ తాజగా రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తూ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

దేశానికి రైతు వెన్నెముక అంటారు అలాంటి రైతుల కోసం వారి కష్టం తెలిసినటువంటి ఈయన ఏకంగా వారికి ట్రాక్టర్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈయన ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.అయితే మొదట విడుతలో భాగంగా కేవలం 10 ట్రాక్టర్లు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు లారెన్స్ తెలిపారు.

ఈ నిస్వార్థ ప్ర‌యాణంలో ప్ర‌తి ఒక్క‌రూ చేరి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు ఓ వీడియోను పోస్ట్ చేశారు. మనం మాట్లాడే మాటల కంటే చేతులు చేసే పనులు ఎక్కువగా ఉంటాయని అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మద్దతుగా నిలబడాలని ఈయన కోరారు. ఇలా మొదటి విడతలో భాగంగా పదిమందికి ట్రాక్టర్లను అందజేసినటువంటి లారెన్స్ త్వరలోనే మరి కొంతమంది రైతులకు కూడా ఈయన ట్రాక్టర్లు అందచేయనున్నట్లు తెలుస్తోంది.

Read More: పుష్ప రాజ్ టీ గ్లాస్ స్టెప్ పై అనసూయ కామెంట్స్.. ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు