రాహుల్ రామ‌కృష్ణ‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు

February 6, 2022

రాహుల్ రామ‌కృష్ణ‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు

Rahul Ramakrishna మంచి క‌మెడియ‌నే…అయితే కేవ‌లం బూతులు, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌ మాట్లాడి మాత్ర‌మే న‌వ్వించ‌గ‌ల‌డు అనే అభిప్రాయం కూడా ఉంది. గ‌తేడాది స‌రైన పాత్ర‌లు కూడా ప‌డ‌లేదు..ఈ మ‌ధ్య సినిమాల్లో ఆయ‌న కామెడి పండ‌డం లేదు. వీటికి తోడు వివాదాల‌కు ఎప్పుడు సిద్దం. గ‌తంలో ఒక‌సారి ట్విట్ట‌ర్‌లో పిచ్చి పిచ్చి వ్యాఖ్య‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యాడు. అయితే నిన్న రాహుల్ రామ‌కృష్ణ వేసిన మ‌రో ట్వీట్ అయ‌న్ని మ‌ళ్లీ ట్రోలింగ్‌కి గురి చేసింది.

2022 నుంచి ఇక సినిమాలు వదిలేస్తా అంటూ ఓ ట్విట్ వేసారు. దాంతో ఇంకేముంది నెటిజ‌న్లు అంతా పాజిటివ్, నెగిటివ్ కామెంట్స్ చేశారు. మీడియా కూడా ఓ వార్త దొరికింది కదా అని అందుకుంది. అంత‌లోనే మూర్ఖులారా అది జోక్. మంచి ఆదాయాన్ని, స‌క‌ల ప్రయోజనాలతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుంటాను? నా రిటైర్మెంట్ నిజమనుకుని నా ఫ్రెండ్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.. అదే నాకు నమ్మకం కలగడం లేదు అని మ‌రో ట్వీట్ వేసి క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్ మీద అయితే రాహుల్‌ను బండ బూతులు తిట్టేస్తున్నారు.

ఫూల్స్ ఏంటి.. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ వేషాలే వేయొద్దు.. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిన్ను నిజంగా అభిమానించే వాళ్లు ఫీలై ఉంటే వాళ్లు కూడా ఫూల్సేనా? అంటూ రాహుల్‌ను ఏకిపారేస్తున్నారు. ఇక ఆ వార్తను క్యారీ చేసిన మీడియా జ‌నాల్ని కూడా ఫూల్స్ అన‌డం కొన్ని మీడియా సంస్థ‌ల‌కు న‌చ్చ‌డంలేదు..దాంతో రాహుల్ రామ‌కృష్ణ మీడియాకి క్ష‌మాప‌ణ‌లు చెప్పేదాక ఆయ‌న న్యూస్‌లు క్యారీ చెయ్యం అని బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నాడు. మ‌రి చూడాలి ఒక్క ట్వీటుతో అటు నెటిజ‌న్ల‌తో పాటు ఇటు మీడియా ఆగ్ర‌హానికి గురైన రాహుల్ రామ‌కృష్ణ(Rahul Ramakrishna) త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ ఏంటో…

Read Moreబాలీవుడ్ క్రేజీ కాంబినేష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్‌!

ట్రెండింగ్ వార్తలు