రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన రాజమౌళి!

June 8, 2024

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన రాజమౌళి!

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. అయితే ఈయన చనిపోయారు అనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి చెందినవారు రాజకీయ రంగానికి చెందినవారు ఆయన చివరి చూపు కోసం తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి రామోజీ ఫిలిం సిటీ చేరుకొని రామోజీరావుకు నివాళులు అర్పించారు.

ఇలా రామోజీరావుకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన రామోజీరావును చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. తన భార్యతో కలిసి రాజమౌళి రామోజీరావుకి నివాళులు అర్పించారు. ఇక అనంతరం ఈయన మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఒక మనిషి అన్ని రంగాలలో రాణించడం గొప్ప విషయం. రామోజీరావు అనేక ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి, కేవలం స్థాపించడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఏ రంగంలో అడుగుపెట్టిన దాన్ని శిఖరాలకు తీసుకువెళ్లిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన ఎంతోమందికి తన వ్యాపార సంస్థల ద్వారా ఉపాధి కల్పించడమే కాకుండా ఎంతో మంది నటీనటులకు జీవితాన్ని కూడా కల్పించారని తెలిపారు.

ఇలా ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన రామోజీరావుకు తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలని అదే ఆయనకు నిజమైన నివాళి అంటూ రాజమౌళి తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈయనకు సంతాపం ప్రకటించారు. ఇక రామోజీరావు అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగబోతున్నాయి.

Read More: ప్రభాస్ అనుష్కల పెళ్లి పై ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్.. మాకేం అభ్యంతరం లేదంటూ?

ట్రెండింగ్ వార్తలు