న‌ట‌కిరీటికి క‌రోనా పాజిటీవ్‌..

January 9, 2022

న‌ట‌కిరీటికి క‌రోనా పాజిటీవ్‌..

సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్‌ కుటుంబ సభ్యులు స్వయంగా వెల్ల‌డించారు. రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలడగా ఉందని.. అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన పని లేదని వాళ్ళు తెలిపారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌ లోని ఎఐపీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

రాజేంద్ర ప్రసాద్‌ కి నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంగా ఉండ‌డంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. దాంతో ఆయనను వైద్యులు పరీక్షించగా ఆయనకు కరోనా అని తేలింది. ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా భారీన ప‌డుతుండ‌డంతో దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్‌లు ప‌డ్డాయి.

Related News

ట్రెండింగ్ వార్తలు