Jailer Movie First Look: రజనీకాంత్‌ సినిమాలో తమన్నా

August 24, 2022

Jailer Movie First Look: రజనీకాంత్‌ సినిమాలో తమన్నా

సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ న‌టిస్తోన్న‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘జైలర్‌’. విజ‌య్ తో బీస్ట్‌, శివ‌కార్తికేయ‌న్‌తో డాక్ట‌ర్ వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన నెల్సన్‌ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. తాజాగా తలైవా రజనీకాంత్ సోమవారం జైలర్ మూవీ పోస్టర్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇన్‌షర్ట్‌తో మాస్ లుక్‌లో రజనీ జైలర్ పోస్టర్‌లో కనిపించాడు. షూటింగ్ నిన్న సోమవారం నుంచి ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ సినిమాలో తమన్నా ఓ కీ రోల్‌ చేయనున్నారు. రజనీకాంత్‌తో స్క్రీన్‌ను షేర్‌ చేసుకునేందుకే తమన్నా ఈ సిని మాకు సైన్‌ చేశారు. ఆల్రెడీ ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీ రోల్‌ చేస్తున్నారు. ఐశ్యర్యారాయ్‌ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ ప్రారంభమైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు