కుర్రకారుతో పోటీ పడుతున్న రజనీకాంత్.. ఫుల్ ఖుషి లో ఫ్యాన్స్!

May 14, 2024

కుర్రకారుతో పోటీ పడుతున్న రజనీకాంత్.. ఫుల్ ఖుషి లో ఫ్యాన్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయాన్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రజనీకాంత్ నటించిన 170 చిత్రం ఈ సినిమా. ఈ సినిమాలో బిగ్ బి అమితాబచ్చన్ తో పాటు ఫహద్ ఫాజిల్, రానా దగ్గుపాటి, మంజు వారియర్, కిషోర్, రితికా సింగ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ పై సుభాస్కరన్, జీకేఎం తమిళ కుమరన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది మూవీ టీం.

బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఇకపోతే కుర్రకారుతో పోటీపడి మరీ సినిమాల మీద సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఈ సినిమాలో తనకి సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేసుకొని తన 171 చిత్రం కూలి షూటింగ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్ టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల దగ్గర నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ముందుగా షారుక్ ఖాన్ ని సంప్రదించగా ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే రణవీర్ సింగ్ మాత్రం ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సపోర్టింగ్ రోల్ చేస్తున్నారా లేదంటే విలన్ గా నటిస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా జైలర్ కి సీక్వెల్ గా వస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. హుకుం పేరుతో జైలర్ పార్ట్ టు పనులను డైరెక్టర్ దిలీప్ కుమార్ మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. జూన్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. #Jailer2, #Hukum హాస్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు.

Read More: మా వాడే అయిన పరాయి వాడే.. నాగబాబు కౌంటర్ బన్నీకేనా?

ట్రెండింగ్ వార్తలు