హాస్పిటల్ పై బెడ్ పై అలాంటి పరిస్థితిలో రాఖీ సావంత్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

May 15, 2024

హాస్పిటల్ పై బెడ్ పై అలాంటి పరిస్థితిలో రాఖీ సావంత్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి మనందరికి తెలిసిందే. ఈమె ఎక్కువగా పిచ్చి పిచ్చి డ్రెస్ లు వేసుకుంటూ వస్త్రధారణ విషయంలో ఉర్ఫి జావెద్ కీ పోటీగా నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కీ గురవుతూ ఉంటుంది. ఈమె సోషల్ మీడియా ద్వారానే కాకుండా కాంట్రవర్సీల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇది ఇలా ఉంటే తరచూ ఏదో విషయంతో వార్తల్లో నిలిచే రాఖీ సావంత్ తాజాగా హాస్పిటల్ బెడ్డుపై అచేతనావస్థలో కనిపిచింది. అయితే అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు ఏమైందో అంటూ నెటిజన్లు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గుండెకు సంబంధించిన సమస్యతో ఇలా హాస్పిటల్ చేరిందంటూ బాలీవుడ్ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఆమె ఇంస్టాగ్రామ్ ను చూస్తే మాత్రం గంట క్రితం కూడా ఏదో ఫన్నీ రీల్‌ను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే నిన్న మొన్న అంతా కూడా టవల్‌ తో వింత వింత పోజులు పెడుతూ, వింత అవుట్ ఫిట్‌ను ధరించి హంగామా చేసిన ఆమె తాజాగా ఒక్కసారిగా హాస్పిటల్ బెడ్డు మీద ఉన్న ఫొటోస్ వైరల్ కావడంతో ఇది నిజమా లేక ఫేక్ నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోస్ లో ఆమె చేతికి సెలైన్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది.

దీంతో రాఖీ సావంత్‌కు ఏదో సీరియస్ ఇష్యూ ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టుగా జాతీయ మీడియా వార్తలు రాసుకొస్తోంది. కాగా విచిత్ర వస్త్ర ధారణ విషయంలోనే కాకుండా బిగ్ బాస్ హౌస్ ద్వారా కూడా మంచి పాపులరిటీ సంపాదించుకుంది.

Read More: తరుణ్ కారణంగా బన్నీకి ఆర్య సినిమా ఛాన్స్ వచ్చిందా.. ఎలానో తెలుసా?

Related News

ట్రెండింగ్ వార్తలు