February 17, 2024
రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కన్నడలో ఈమె నటించిన మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఇతర భాష చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకొని తెలుగులో కూడా మంచి సక్సెస్ అయ్యారు. ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా పుష్ప సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన యానిమల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల ఒక అరుదైన ఘనత సాధించిన సంగతి మనకు తెలిసిందే.
అండర్ 30 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది . ఈ క్రమంలోనే పలువురు స్టార్ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు. తన రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి ఈమె ప్రశంసల కురిపించిన సంగతి తెలిసిందే. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నువ్వు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే రష్మిక మాజీ ప్రియుడు నటుడు రక్షిత్ శెట్టి కూడా ఈ విషయంపై స్పందించారు.
రష్మిక అనుకున్నది సాధిస్తుంది ఆమెకు జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి . ఆమె గోల్స్ కచ్చితంగా రీచ్ అవుతుంది సో టాలెంటెడ్ ..మేము పెళ్లి బ్రేక్ చెప్పుకున్నా సరే మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం.. రష్మిక ఇంకా మంచి స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నానని తెలియజేశారు ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని బ్రేకప్ చెప్పుకున్నారు అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని రష్మిక ఇంకా తనతో స్నేహం చేస్తుందని తెలుస్తుంది. ఇలా బ్రేకప్ చెప్పిన వ్యక్తితో స్నేహంగా కొనసాగాలి అంటే మామూలు విషయం కాదంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.
Read More: పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా.. వివాదాస్పద వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!