నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా.. ఇండియన్ 2 పై రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

June 12, 2024

నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా.. ఇండియన్ 2 పై రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినీనటి రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈమెకు తెలుగులో తమిళ భాష చిత్రాలలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్న రకుల్ ప్రీత్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ నటిగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ ఇండియన్ 2 సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇలా భారతీయుడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన త్వరలోనే భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పాత్ర గురించి ఈమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటివరకు నేను నా కెరియర్ లో నటించిన అన్ని సినిమాలలో కల్లా ఇది బెస్ట్ సినిమా అని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలలో నటించలేదని ఈ సినిమా షూటింగ్ నాకు ఒక గొప్ప అనుభూతిని కలిగించిందని రకుల్ తెలిపారు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శంకర్ కి కృతజ్ఞతలని ఆయన దర్శకత్వంలో చేయటం నా అదృష్టమని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది కానీ దానికి మరికాస్త సమయం ఉందని తెలిపారు.

Read More: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా బన్నీ తారక్… అదే ప్రధాన కారణమా?

ట్రెండింగ్ వార్తలు