January 10, 2022
Rakul Preet Singh About Her Relationship With Jackky Bhagnani: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానితో గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు సీక్రెట్ డేటింగ్ చేసిన వీరిద్దరూ ఈ ఏడాది తమ రిలేషన్‌ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎలాగు తన రిలేషన్‌ను వారే బయటకు రీవిల్ చేయడంలో సోషల్ మీడియాలో అందరూ రకుల్-జాకీ భగ్నానీ పెళ్లి చేసుకోబో తున్నారంటూ జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. ఇంత వరకూ బాగానే ఉంది కాని తమ తమ రీలేషన్‌ను ప్రకటించినప్పటి నుంచి రకుల్ కానీ, జాకీ కానీ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దీంతో రకుల్ తన పెళ్లి డేట్ చెప్పాలంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా అడుగు తున్నారు. మరి చూడాలి ఈ జంట మీడియా ముందుకు వచ్చి తమ పెళ్లి డేట్‌ను చెప్తుందో.. లేదో..?
#Read More: ఐలవ్‌యూ చెప్పిన శ్రుతీహాసన్…ఇదిగో సాక్ష్యం!