ఆ లగ్జరీ హౌస్ నా కూతురి కష్టం.. ఆ వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రకుల్ తండ్రి?

May 23, 2024

ఆ లగ్జరీ హౌస్ నా కూతురి కష్టం.. ఆ వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రకుల్ తండ్రి?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రకుల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది రకుల్. ఇకపోతే ఇటీవలె ఈమె తన ప్రియుడు జాకీ భగ్నాని ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో మునికి తేలుతున్న ఈ జంట ఇటీవల ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.

మొన్నటి వరకు చేతినిండా బోలెడు సినిమా అవకాశాలతో ఫుల్ బిజీబిజీగా గడిపిన రకుల్ ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడంతో ఖాళీగానే ఉంటోంది. ఇది ఇలా ఉంటే ఈమె సినిమాలలో నటించక పోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే రకుల్ కి సంబంధించిన ఎన్నో వార్తలు వినిపించగా కొన్ని రకాల వార్తలు ఆమెను ఆమె ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయి. రకుల్ కూడా కొన్ని రూమర్స్ కి ఇబ్బందులు ఎదుర్కొంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సమయంలో రకుల్ పేరు కూడా విపించింది. కానీ ఆ తర్వాత ఆ కేసు నిలబడలేదు. అయితే అవన్నీ పక్కన పెడితే ఒక రూమర్ అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టిందట.

ఈ విషయం గురించి రకుల్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో వచ్చే రూమర్స్ గురించి నాకు తెలుసు. వాస్తవం కాకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారు. మా నాన్నకి కూడా కొంత తెలుసు. కానీ ఒక్కో సారి విచిత్రమైన రూమర్స్ క్రియేట్ చేస్తే సహజంగా కోపం వస్తుంది. నేను హైదరాబాద్ లో ఒక లగ్జరీ హౌస్ కొన్నాను. నేను నటిగా జీరో నుంచి ప్రారంభించి కష్టపడి ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆయా డబ్బులు సేవ్ చేసుకుని ఇల్లు కొనుగోలు చేశాను. రకుల్ హైదరాబాద్ లో ఉన్న హౌస్ ధర 3 కోట్ల వరకు ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

నా కష్టంతో ఆ ఇల్లు కొనుక్కుంటే ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చారని పుకార్లు పుట్టించారు. నాన్న ఢిల్లీలో ఉన్నారు. నా సంపాదన గురించి, నా కష్టం గురించి మా నాన్నకి మొత్తం తెలుసు. ఒక బడా సెలెబ్రిటీ రకుల్ కి లగ్జరీ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ గురించి మా నాన్నకి తెలిసింది. వెంటనే నా మేనేజర్ కి నాన్న ఫోన్ చేసి కోపంగా అరిచేశారు. ఆ ఇల్లు నా కూతురి కష్టం అయితే వాడెవడో ఇచ్చారని అంటారా ? అసలేం వార్తలు అవి అంటూ మేనేజర్ ని తిట్టేశారు. నేను ఫోన్ తీసుకుని ఇక్కడ అంతే నాన్న వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైట్ తీసుకో అని చెప్పాను అని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

Read More: రేవ్ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దంటున్న యాంకర్

ట్రెండింగ్ వార్తలు