January 8, 2024
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు అందరూ కూడా వారి ఫిట్నెస్ పై చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలి అన్న అవకాశాలను అందుకోవాలన్న అందంతో పాటు ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం అందుకే సెలెబ్రిటీలు ఎక్కువగా జిమ్ లోనే కాలం గడుపుతూ ఉంటారు. సినిమా షూటింగ్స్ ఉంటే షూటింగ్ పనులను చేసుకుంటూ బిజీగా ఉంటారు ఇక ఎప్పుడైనా వీరికి విరామం దొరికింది అంటే ఆరోజు తప్పనిసరిగా జిమ్ లో ఉంటారు.
ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటారు. ఇకపోతే సెలబ్రిటీలు వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏకంగా 55 కిలోల బరువును ఈమె పొత్తి కడుపుపై పెట్టుకుని చేస్తున్నటువంటి వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఈ వీడియో చూస్తే కనుక వామ్మో అనక మాత్రం మానరు అంతగా ఈమె కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ బరువు పెరగడం చాలా ఈజీ అవుతుంది కానీ తగ్గించుకోవడం కష్టంగా ఉంటుందని అయితే ఒకేసారి బరువును తగ్గించుకోకుండా మనం సరైన బ్యాలెన్స్ మైంటైన్ చేస్తూ తగ్గించుకోవడం ముఖ్యం అంటూ ఈ సందర్భంగా రకుల్ షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో రకుల్ సౌత్ సినిమాలను పూర్తిగా పక్కనపెట్టి కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నారు. అయితే సౌత్ లో సరైన అవకాశాలు రాకపోవడంతోనే సినిమాలు చేయట్లేదని ఈమె వెల్లడించారు. ఇకపోతే ఈ ఏడాదిలో రకుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి .ఈమె బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
Read More: ఏం ఫిట్ నెస్‌రా బాబు.. అదరగొట్టేస్తోన్న సమంత