Ram Charan-Upasana: అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరవుతున్న ఏకైక టాలీవుడ్ హీరో?

July 11, 2024

Ram Charan-Upasana: అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరవుతున్న ఏకైక టాలీవుడ్ హీరో?

Anant Ambani Marriage: భారతదేశ అపర కుబేరుడు అంబానీ ఇంటపెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. జూలై 12వ తేదీ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇప్పటికే ఈ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఇక ఈ పెళ్లి వేడుకలలో ఎంతో మంది ప్రముఖులు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే సంగీత హల్దీ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం ఒకే ఒక హీరోకి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మాత్రమే ఈ వివాహ ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న అనంత్ – రాధికా పెళ్లి వేడుకలకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ ఉపాసన దంపతులు నేడు ఈ వివాహానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ దంపతులు గతంలో కూడా అనంత్ అంబానీ రాధిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా హాజరై సందడి చేశారు. ఆ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి వేదికపై RRR సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలవడంతో ఈయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే

Read MoreNag Ashwin: ఆల్ టైం ఫేవరెట్ ఫోటోను షేర్ చేసిన నాగ్ అశ్విన్… ఏమంత స్పెషల్?

Related News

ట్రెండింగ్ వార్తలు