క్లిన్ కారా వద్దకు చేరిన ప్రభాస్ బుజ్జి.. ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న మెగా ప్రిన్సెస్!

June 3, 2024

క్లిన్ కారా వద్దకు చేరిన ప్రభాస్ బుజ్జి.. ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న మెగా ప్రిన్సెస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుత కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రభాస్ బుజ్జిని పరిచయం చేస్తూ పెద్ద ఈవెంట్ నిర్వహించారు.

ఇక ఈ బుజ్జి ప్రస్తుతం పలు ప్రధాన నగరాలలో చక్కర్లు కొడుతూ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. అంతేకాకుండా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ కూడా తీసుకువచ్చారు. అయితే ఈ బుజ్జి భైరవ క్యారెక్టర్స్ పిల్లలకు దగ్గరగా చేరేందుకు పెద్ద ఎత్తున బొమ్మలను తయారు చేయడమే కాకుండా అందుకు సంబంధించిన స్టిక్కర్స్ కూడా తయారు చేసి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన టీషర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇక చిత్ర బృందం ఈ బుజ్జి బొమ్మలను పలువురు సినీ సెలబ్రిటీల పిల్లలకు కానుకలుగా పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారాకు కూడా కానుకగా అందజేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆ బొమ్మలతో ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

క్లిన్ కారా ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ కల్కి చిత్ర బృందానికి ఉపాసన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని ఈమె కోరుకున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ వంటి వారందరూ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.

Read More: సౌందర్య చనిపోతే ఏడవాలని రూల్ లేదు… జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్ వార్తలు