హైదరాబాదులో గేమ్ చేంజర్ క్లైమాక్స్ షూటింగ్.. నెక్స్ట్ మంత్ నుంచి వేరే షూటింగ్ లో చరణ్!

May 15, 2024

హైదరాబాదులో గేమ్ చేంజర్ క్లైమాక్స్ షూటింగ్.. నెక్స్ట్ మంత్ నుంచి వేరే షూటింగ్ లో చరణ్!

ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం అందులోనూ శంకర్ దర్శకత్వంలో అభిమాన నటుడు హీరోగా నటిస్తూ ఉండడం వలన సినిమా మీద భారీ అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు.

వారి అంచనాలు ఎక్కడ తగ్గకుండా చూసేందుకే చిత్రీకరణ ఆలస్యం అవుతూ వస్తుంది, ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీస్తున్నారంట శంకర్. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవల తుదిదసకు చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించారు.

ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రామ్ చరణ్ తో పాటు ఇతర తారాగణం పై సన్నివేశాలని తీర్చిదిద్దుతున్నారు.ఈ సినిమా మీద ప్రత్యేక దృష్టి సారించిన రామ్ చరణ్ ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్లో అడుగు పెడతారని సమాచారం. గేమ్ చేంజ్ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న 50వ సినిమా కావటంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారంట.

సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉండగా జయరాం, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్ గా, సీఎంగా రెండు పాత్రలలో అలరించబోతున్నారు. ఈ సినిమాలో చెర్రీ మొత్తం 27 గెటప్స్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో 20 నిమిషాల సీక్వెన్స్ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

Read More: హైదరాబాదులో నాని సినిమా క్లైమాక్స్ ఫైటింగ్.. కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్!

ట్రెండింగ్ వార్తలు