August 5, 2024
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 సినిమా ఘోరంగా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా విషయంలో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటుడు రాజీవ్ కనకాల తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.ఇండియన్ 2 కథ వేరు, గేమ్ ఛేంజర్ కథ వేరు. కథలో డ్రామాతో పాటు పూర్తీ కమర్షియల్ గా సినిమా ఉంటుంది. ఇక పాటలు విషయానికి వస్తే, ఒక్కో పాటని 10-12 కోట్ల ఖర్చుతో తీశారు. మేము అయితే మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాకి ఉన్న మరో పెద్ద ప్లస్ ఏంటంటే రామ్ చరణ్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేసింగ్ లో ఉండటం ఆయన ఉంటే కాసుల వర్షం కురుస్తుంది.
రామ్ చరణ్ గారు శంకర్ కి దొరికిన ఒక గొప్ప నిధి అంటూ ఈ సందర్భంగా రాజీవ్ కనకాల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన చేసిన కామెంట్స్ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచేసాయి. ఇక ఈ సినిమా డిసెంబర్లో రాబోతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు వెల్లడించారు కానీ ఏ తేదీ విడుదల కాబోతుందనే విషయాల గురించి మాత్రం ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు