June 5, 2024
సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే ఈయన 15 సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఇప్పటికే రెండు చోట్ల ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఘోర పరాజయమయ్యారు కానీ ఈసారి మాత్రం కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
ఇక ఈ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇలా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు అభినందనలను తెలియజేస్తున్నారు.
ఇక మెగా కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. మెగా కుటుంబ సభ్యులందరూ పిఠాపురంలోనే ఫలితాలను వీక్షించి పవన్ కళ్యాణ్ గెలుపు పై ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక చిరంజీవి ఇంటిలో కూడా పెద్ద ఎత్తున బాణసంచాలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇక చిరంజీవితో పాటు ఇతర మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గెలుపు పై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సైతం తన బాబాయ్ గెలుపు పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. బాబాయ్ విజయానికి గర్విస్తూ.. మా కుటుంబానికి గర్వకారణమైన రోజు అద్భుతమై విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు నా శుభకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గెలుపు పై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Read More: మళ్లీ జబర్దస్త్ లోకి రోజా… జబర్దస్త్ కి రానున్న పూర్వ వైభవం?