ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఒకరు వైసీపీ, ఒకరు జనసేన?

May 11, 2024

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఒకరు వైసీపీ, ఒకరు జనసేన?

ఏపీలో గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఎన్నికల హడావిడి నేటితో ముగియనుంది. సోమవారం రోజు పోలింగ్ జరగనుండడంతో నేటి సాయంత్రంతో ప్రచార కార్యక్రమాలకు తరలించనున్నారు. అయితే పోలింగ్కు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో రాజకీయ నాయకులలో టెన్షన్ మొదలైంది. అలాగే ప్రచార కార్యక్రమాలకు కూడా మరికొన్ని గంటల సమయం ఉండడంతో ఫుల్ గా ప్రచారాలు చేస్తూ పూర్తి మద్దతును పలుకుతున్నారు అభిమానులు సెలబ్రిటీలు. ఇప్పటికే పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు పూర్తిగా మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

కేవలం టీడీపీ కోసం మాత్రమే కాకుండా వైసీపీ కోసం కొందరు సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు. తాజాగా బన్నీని నంద్యాల వైసీపీ అభ్యర్థి తన విజయం కోసం రంగంలోకి దించాడు. మరో వైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ కూడా పిఠాపురంకు వచ్చేశాడు. ఆల్రెడీ అల్లు అర్జున్ నంద్యాలలో అడుగు పెట్టేశాడు. బన్నీ కోసం వచ్చిన జనాన్ని చూస్తే.. అది నంద్యాల కాదు.. సంద్రంలా అనిపిస్తోంది. ఇక రామ్ చరణ్ సైతం పిఠాపురంలోకి అడుగు పెట్టేసినట్టుగా తెలుస్తోంది. చరణ్ వెంట అల్లు అరవింద్, సురేఖ కొణిదెల కూడా ఉన్నారు. ముందుగా పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

అయితే ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు వేరు వేరు పార్టీలకు సపోర్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఈ విషయం కాస్త ట్రెండింగ్ గా మారింది. మళ్లీ మెగా అభిమానుల్లో చీలికలు రాకుండా ఉండేందుకే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్తే.. అల్లు అరవింద్ పిఠాపురంకి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయినా బన్నీ వెళ్లింది పార్టీ కోసం కాదని, తన మిత్రుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం వెళ్లాడని అంటున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ మాత్రం తన బాబాయ్ కోసం పిఠాపురానికి వెళ్లాడు. ఇక అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుందని, ఆ సభలో చరణ్ ప్రసంగిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం ట్విట్టర్లో అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అన్నట్టుగా ట్రెండింగ్ వార్తలు నడుస్తున్నాయి.

Read More: చిరంజీవి పద్మ విభీషణ్ పై రామ్ చరణ్ కామెంట్లు.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చిరు ఫామిలీ!

Related News

ట్రెండింగ్ వార్తలు