బాలీవుడ్ క్రేజీ కాంబినేష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్‌!

February 5, 2022

బాలీవుడ్ క్రేజీ కాంబినేష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్‌!

Ram Charan – Rajkumar Hirani: మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తోంద‌న్న వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఒక వేళ ఈ వార్త క‌నుక నిజం అయితే రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల ఆనందానికి హ‌ద్దుంలుండ‌వు. ఎందుకంటే సాహో సినిమాతో ప్ర‌భాస్‌, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్‌లో 100కోట్ల మార్కెట్‌ను ఏర్ప‌ర‌చుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఈ మార్కెట్‌ను అందుకున్నా అది రాజ‌మౌళో లేదా మ‌ల్టీస్టార‌ర్ ఖాతాలోకి వెళ్తుంది. అందుకే ప్ర‌భాస్, అల్లు అర్జున్ మాదిరిగా సోలో సినిమాతో 100 కోట్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని చూస్తున్నాడంట రామ్ చ‌ర‌ణ్‌. ప్రస్తుతం శంక‌ర్ సినిమాతో అది అసాధ్యం కాబ‌ట్టి డైరెక్ట్ హీందీ మూవీ చేయాలని చూస్తున్నాడంట. ఆ స‌మ‌యంలోనే ఈ ఆఫ‌ర్ తీసుకొచ్చింద‌ట పెన్ స్టూడియోస్. అయితే రామ్ చ‌ర‌ణ్‌కి బాలీవుడ్ అంత క‌లిసి రాలేదు. జంజీర్ సినిమా రిజల్ట్ ఎంటో తెలుసుకదా.. అయితే ఆ సినిమా స‌మ‌యంలో స‌రైన ప్లాన్ లేకుండా చేశాడ‌ట. అందుకే ఈ సారి ప‌క్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేసి త‌న అదృష్టాన్ని మ‌రోసారి పరీక్షించుకోనున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. త్వ‌ర‌లోనే Ram Charan – Rajkumar Hirani సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఇన్‌సైడ్ టాక్‌.

Read More: ఆస‌క్తిక‌రంగా కిర‌ణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ టీజర్ 

ట్రెండింగ్ వార్తలు