Ramcharan: బుచ్చిబాబు సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లు తెలుసా?

May 30, 2024

Ramcharan: బుచ్చిబాబు సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఎన్ని కోట్లు తెలుసా?

Ramcharan: ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి రామ్ చరణ్ ఇటీవల నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చింది.

ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాంచరణ్ ఏకంగా 90 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు దిల్ రాజు కుమార్తె హన్షిత వెల్లడించారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం RC16 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోబోతోంది ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం రాంచరణ్ ఏకంగా 125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఈయన ఏకంగా 30 కోట్లకు పైగా పారితోషకం పెంచారని చెప్పాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో మరోసారి చేయబోతున్నారు ఈ విషయాన్ని కూడా ఇటీవల ప్రకటించారు.

Read More: ఆ ఒక్క కారణంతోనే కల్కి బడ్జెట్ ఎక్కువైంది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు