తండ్రి చిరంజీవి కోసం సింగర్ గా మారిన రామ్ చరణ్.. ఏమైందంటే?

May 3, 2024

తండ్రి చిరంజీవి కోసం సింగర్ గా మారిన రామ్ చరణ్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో చిరంజీవి ఒకరు. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి రాంచరణ్ అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి నేడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఈయన సినిమాకు తనలో ఉన్నటువంటి నటన నైపుణ్యాన్ని మెరుగులు దిద్దుతూ హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగారు. నటన పరంగా రామ్ చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు సంపాదించుకోవడంతో చిరంజీవి కూడా పుత్రోత్సాహంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికే ఎన్నో అవార్డులు పురస్కారాలను అందుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక ఈయన ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ ప్రారంభించినటువంటి రాంచరణ్ ప్రస్తుతం నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా కొనసాగారని తెలుస్తుంది. ఏకంగా తన తండ్రి కోసమే ఈయన సింగర్ గా మారి పాట పాడినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రజారాజ్యం పార్టీ కోసం రామ్ చరణ్ మణిశర్మ దర్శకత్వంలో ఓ పాటను పాడారు. చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమాలోని ఒక పాటను ప్రజారాజ్యం పార్టీ కోసం పాడారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్.. రైతులకు ఉచితంగా ట్రాక్టర్స్!

ట్రెండింగ్ వార్తలు