బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న చరణ్.. పెరుగుతున్న అంచనాలు?

June 6, 2024

బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న చరణ్.. పెరుగుతున్న అంచనాలు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరగబోతున్నాయి. ఈ సినిమా అనంతరం తిరిగే రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా కూడా అధికారకంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా తాజాగా బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ జిమ్నాస్టిక్ కి సంబంధించి ఉంటుందని సమాచారం అయితే ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కాకుండా తన డూప్ ను పెడదామని బుచ్చిబాబు చెప్పారట కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.

ఇలా ఈ ఎపిసోడ్ లో డూప్ లేకుండా తాను నటించడం కోసం ఈయన ఏకంగా జిమ్నా స్టిక్స్, కర్ర సాము లాంటి వాటిని నేర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ తన సినిమాలో ఏది చేసినా తనే చేయాలనే పట్టు పడుతూ ఉంటారు. ఇలా సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా స్పష్టంగా రావడం కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడుతూ ఉంటారని ఇప్పటికి ఎంతోమంది ఈయన ఎడ్యుకేషన్ గురించి ప్రశంసల కురిపించారు.

ఇక డైరెక్టర్ బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. మొదటి సినిమాతోనే డైరెక్టర్గా సక్సెస్ అయినటువంటి ఈయన తన రెండో సినిమాని రాంచరణ్ తో చేసే అవకాశం అందుకోవడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా గురించి ఈ వార్తలు వైరల్ గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెరుగుతున్నాయి.

Read More: పోటీ ఉంటేనే ప్రతిభ మెరుగుపడుతుంది.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

ట్రెండింగ్ వార్తలు