బుల్లి ఏనుగుతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న చరణ్ క్లిన్ కారా, రైమ్ ఉపాసన.. ఫోటోలు వైరల్!

April 8, 2024

బుల్లి ఏనుగుతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న చరణ్ క్లిన్ కారా, రైమ్ ఉపాసన.. ఫోటోలు వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాతో బిజీ కాబోతున్నారు అనంతరం సుకుమార్ డైరెక్షన్లో కూడా రామ్ చరణ్ సినిమాలకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రామ్ చరణ్ తన విలువైన సమయాన్ని తన ఫ్యామిలీకి కూడా కేటాయిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే చరణ్ ఇటీవల తన భార్య కూతురితో కలిసి థాయిలాండ్ వెకేషన్ వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఇలా థాయిలాండ్ వెకేషన్ లో భాగంగా వీరు అక్కడ దిగినటువంటి ఫోటోలను ఎప్పటికప్పుడు ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు. అయితే గత రాత్రి రామ్ చరణ్ తిరిగి థాయిలాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఇదిలా ఉండగా తన పెట్ రైమ్ కి కూడా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా రైమ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ నాన్న, బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేసాను, స్విమ్ చేసాను, చెల్లి క్లిన్ కారాతో ఆడుకున్నాను, నేను కొత్త థాయ్ కట్ చేయించుకున్నాను అంటూ క్యూట్ గా ఫోటోలను షేర్ చేశారు ఈ ఫోటోలలో రైమ్ నీటిలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది.

మరో ఫొటోలో చిన్ని ఏనుగుకి చరణ్ వాటర్ పోస్తుంటే ఉపాసన క్లిన్ కారాని ఎత్తుకొని ఆ ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తుంది. మరో ఫొటోలో రైమ్ ని అక్కడి బ్యాంకాక్ వాళ్ళు ఎత్తుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఉపాసన చరణ్ క్లీన్ కారాతో కలిసి చిన్న ఏనుగుకి స్నానం చేస్తున్నటువంటి ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

Read More: ఆ లెటర్ చూడగానే షాక్ అయ్యాను.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు