January 10, 2022
Ram Gopal Varma and Perni nani meeting: ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ చర్చల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. టికెట్ ధరలపై తాను ఐదారు కీలక అంశాలు ప్రస్తావించానని ఆర్జీవి తెలిపారు. అలాగే పేర్ని నాని కూడా కొన్ని ఇతర అంశాలు ప్రస్తావనకు తీసుకువచ్చారని వర్మ పేర్కొన్నారు. టికెట్ ధర పెరిగితే ప్రజలు ఇబ్బందిపడతారని మంత్రి చెప్పగా టికెట్ ధర తగ్గిస్తే ఈ ప్రభావం సినిమా నాణ్యతపై పడుతుందని తాను చెప్పానని రాంగోపాల్ వర్మ అన్నారు. ఫేక్ కలెక్షన్స్, పన్ను ఎగవేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించానని మరిన్ని అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడిందని తెలిపారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. అయితే సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినిమా పరిశ్రమపై ఉందని వర్మ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. చర్చలు జరిగిన తీరుపై 100 శాతం సంతృప్తిగా ఉందని తెలిపారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి ఒకరిద్దరి కోసం యావత్ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడతారని అనుకోవడంలేదని స్పష్టం చేశారు రాంగోపాల్ వర్మ.
Read More: ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` రిలీజ్‌డేట్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వనిదత్