మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ వైరల్?

June 5, 2024

మొదటిసారి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ వైరల్?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. జనసేన కూడా పోటీ చేసిన ప్రతి ఒక్క ప్రదేశంలో విజయం సాధించడంతో జనసేన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అభిమానులు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా రంగం నుంచి పవన్ ను విష్ చేస్తు ట్వీట్లు చేస్తున్నారు సెలబ్రిటీలు.

అలాగే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫొటోస్ షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి అందరి చూపు ఒకరిపై ఉంది.. ఆయనే రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఎప్పుడు పవన్ ని తిడుతూ, తీవ్రంగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకుని రాంగోపాల్ వర్మ ఆయనపై ఎల్లప్పుడూ నెగటివ్ కామెంట్స్ చేస్తూనే ఉండేవారు. అయితే ఈ భారీ గెలుపుతో ఎలా స్పందిస్తారు అని అంతా ఎదురు చూశారు. ఈ క్రమంలో అందరూ ఎదురు చూసినట్టుగానే ఆర్జీవీ స్పందన రానే వచ్చింది. ఆయన స్పందన చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఆర్జీవిలో ఇలాంటి కళలు కూడా ఉన్నాయా అని షాక్ అయ్యారు. ఇంతకీ ఆయన ఏమనిస్పందించారంటే.. ఆర్జీవీ ఏం రాయలేదు.. అలా అని నెగెటీవ్ గాకూడా పెట్టలేదు. పవర్ కళ్యాన్ పేరు రాసి, ఒక దండం పెట్టే సింబల్ పెట్టేశారు.. నువ్వు నిజంగా గొప్పోడి స్వామి అన్నట్టుగా దండం పెడుతున్న గుర్తులను పెట్టాడు ఆర్జీవి. ఇన్నాళ్లు పవన్ ను చేతగాని వాడిలా ప్రచారం చేసిన రామ్ గోపాల్ వర్మకు ఆయన విజయం చూశాకు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. నోట మాట కూడా రాలేదని ఆయన ట్వీట్ చూస్తేనే అర్ధం అవుతోంది.

 

Read More: మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా.. కృతి శెట్టి రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్ వార్తలు