రామ్ డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..సాహసం చేస్తున్న పూరీ?

May 27, 2024

రామ్ డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..సాహసం చేస్తున్న పూరీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో పూరి దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈయన చివరిగా రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా రామ్ కి కూడా చివరి విజయం కావటం గమనార్హం.

ఈ సినిమా తరువాత రామ్ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా స్వయంగా పూరి జగన్నాథ్ చార్మి కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం సుమారు 70 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్నటువంటి పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారంటే అది సాహసమే అని చెప్పాలి.

ఇక ఈ సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయగా పెద్ద ఎత్తున స్టార్ కాస్టింగ్ కోసమే డబ్బు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ ప్లాన్ చేశాడని..ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని సమాచారం.

Read More: ఎన్టీఆర్ కి తమ్ముడిగా కన్నడ స్టార్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరో?

ట్రెండింగ్ వార్తలు