స‌మ్మ‌ర్ రేసులో రవితేజ…‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుద‌ల‌య్యేది ఎప్పుడంటే..?

December 6, 2021

స‌మ్మ‌ర్ రేసులో రవితేజ…‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుద‌ల‌య్యేది ఎప్పుడంటే..?

క్రాక్ త‌ర్వాత రవితేజ న‌టిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో ర‌వితేజ రైతుల క‌ష్టాలు తీర్చే ఎంఆర్ఓగా క‌నిపించ‌నున్నాడు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. న‌టుడు వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. అక్క‌డ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 25న సినిమాను విడుదల చేయనున్నట్టు ఈ రోజు తెలిపారు. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. అలా సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నాడు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఇప్ప‌టికే స‌మ్మ‌ర్ రేసు మొదలైంది. హీరోలంతా త‌మ సినిమా రిలీజ్ డేట్ల‌ను లాక్ చేసే ప‌నిలో ఉన్నారు. మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట కూడా స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్‌కానున్న విష‌యం తెలిసిందే..

Read More: నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్‌మంత్ర‌

ట్రెండింగ్ వార్తలు