డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఉపాసన.. నా కూతురి కంటే నేను ఎక్కువగా ఏడుస్తాను?

May 15, 2024

డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఉపాసన.. నా కూతురి కంటే నేను ఎక్కువగా ఏడుస్తాను?

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బిజినెస్ ఉమెన్ గా అలాగే ఒక మంచి కోడలుగా, ఒక భార్యగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక ఈమె రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న 11 సంవత్సరాలకు తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి అయినటువంటి 11 సంవత్సరాలకు ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక వీరిద్దరికీ చిన్నారి జన్మించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా అనే నామకరణం చేశారు. ఇకపోతే ఉపాసన ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు ఈ క్రమంలోనే ఈమె తన పోస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ డెలివరీ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు అనడం సర్వసాధారణం అయితే తాను కూడా డెలివరీ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.

ఇలా భార్య డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటారు. అయితే నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు రామ్ చరణ్ కూడా నాకు సపోర్ట్ చేయడానికి నాతో పాటు మా అమ్మ గారి ఇంటికి వచ్చారు అంటూ ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు. ప్రతి ఒక్క అమ్మాయికి ఆ సమయంలో భర్త తోడు ఎంత అవసరమని వెల్లడించారు.

ఇక 11 సంవత్సరాల తర్వాత తనకు కుమార్తె జన్మించడంతో పాప విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని వెల్లడించారు. అయితే తన కుమార్తెను వదిలి ఎక్కడికైనా వెకేషన్ వెళ్లాలి అంటే తనకు చాలా బాధ ఉంటుందని ఉపాసన వెల్లడించారు. ఆ సమయంలో నా కూతురు కంటే నేనే ఎక్కువగా ఏడుస్తానని ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: కేవలం కరోనా వల్లే పెళ్లి చేసుకున్నాము.. కాజల్ షాకింగ్ కామెంట్స్!

Related News

ట్రెండింగ్ వార్తలు