January 6, 2022
RamGopalVarma: ‘‘పేర్నీ నానిగారు( ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి) ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలన్నది మా (సినీ ఇండస్ట్రీ) ఉద్దేశం కాదు. వ్యక్తిగతంగా వైఎస్. జగన్ అంటే నాకు చాలా అభిమానం. కేవలం మా సమస్యలు మేం సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో, మీరు మా కోణం నుంచి సరిగా అర్ధం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్‌స్టాండింగ్ ఏర్పడింది. పేర్నీ నానిగారు నా రిక్వెస్ట్ ఏంటంటే…మీరు అనుమతి ఇస్తే మిమ్మల్నీ కలిసి మా తరఫు నుంచి మా సమస్యలను గురించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వపరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను’’…ఇది రామ్‌గోపాల్ వర్మ ‘ఏపీలోని సినిమా టికెట్ ధరల గురించి చేసిన చివరి ట్వీట్. నిన్నమొన్నటి వరకు ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన రామ్‌గోపాల్ వర్మ సడన్‌గా ఫ్లేట్ ఫిరాయించి పేర్నీ నాని అపాయింట్‌మెంట్ అడగడం ఏంటీ? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్. వర్మ ఇండస్ట్రీకి ఏదో చేస్తాడని ఆశించిన వారు వర్మ చేసిన ఈ లాస్ట్ ట్వీట్ చూసి, ముఖ్యంగా పవన్‌కల్యాణ్ అభిమానులు షాకయ్యారు.
Read More: పేరు మారిస్తే ఫేటు మారుతుందా?