రామోజీరావు మృతిపై చిరు.. తారక ఎమోషనల్ ట్వీట్!

June 8, 2024

రామోజీరావు మృతిపై చిరు.. తారక ఎమోషనల్ ట్వీట్!

రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలో తన నివాసం వద్ద ఉంచారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి సినిమా సెలబ్రిటీలో అలాగే రాజకీయ నాయకులు చేరుకొని తనుకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా రామోజీరావు మృతి పై సంతాపం తెలియజేస్తూ చేస్తున్నటువంటి పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామోజీరావు మృతి పై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం .. దివి కేగింది ఓం శాంతి అంటూ ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ఎన్టీఆర్ సైతం ఈయన మరణ వార్తపై స్పందించారు. శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.

‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఇక రామోజీరావు మరణం పై కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. రామోజీ రావు గారు భారతీయ మీడియా మరియూ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేగూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా రామోజీరావు మరణం పై స్పందిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Read More: పవన్ కళ్యాణ్ విజయంపై అలాంటి ట్వీట్ చేసిన కమల్ హాసన్.. గర్వంగా ఉందంటూ!

ట్రెండింగ్ వార్తలు