రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు?

June 8, 2024

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూత.. సంతాపం తెలుపుతున్న ప్రముఖులు?

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. సినీ ఇండస్ట్రీకి పత్రికా రంగానికి ఎనలేని సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామోజీరావు మరణ వార్త ఒక్కసారిగా ఇటు రాజకీయ రంగానికి పత్రిక రంగానికి అలాగే చిత్ర పరిశ్రమకు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఇక రామోజీరావు మరణించారనే వార్త తెలియడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

రామోజీరావు ఈనాడు సంస్థలను స్థాపించి మీడియా రంగానికి అలాగే రామోజీ ఫిలిం సిటీని స్థాపించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించారు. ఒక నిర్మాతగా కూడా ఈయన ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే వయసు పై పడటంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన ఇంటికి పరిమితమయ్యారు.

ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మరింత క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రామోజీరావుకు వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు అయితే ఈయన పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం తెల్లవారుజామున 4:30 నిమిషాలకు మృతి చెందారు.

ఇక ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే తన నివాసం వద్ద ఉంచారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా రామోజీ ఫిలిం సిటీ చేరుకొని ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రామోజీరావు మృతి పై స్పందిస్తూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Read More: టీటీడీ చైర్మన్ పదవి పై స్పందించిన నాగబాబు… అధికారకంగా వెల్లడిస్తారంటూ?

ట్రెండింగ్ వార్తలు