రామోజీరావు మొదట్లో అలాంటి ఉద్యోగం చేశారా.. ఆయన అసలు పేరు అదేనా?

June 8, 2024

రామోజీరావు మొదట్లో అలాంటి ఉద్యోగం చేశారా.. ఆయన అసలు పేరు అదేనా?

పత్రికా రంగానికి ఎన్నో సేవలు అందించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న పత్రికా వ్యవస్థాపకుడు రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన నేడు ఉదయం తెల్లవారుజామున 4:30 మరణించారు. ఇలా హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న రామోజీరావు మరణ వార్త అందరికీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

రామోజీరావు మరణించారనే విషయం తెలియడంతో ఒకవైపు మీడియా రంగం మరోవైపు చిత్ర పరిశ్రమ అలాగే రాజకీయ నాయకులు కూడా ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈయనని చివరి చూపు చూడటం కోసం తరలివస్తున్నారు. ఇక రామోజీరావు మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.

రామోజీరావు తాత పేరు చెరుకూరి రామయ్య ఈయన చనిపోయిన 13 రోజులకు ఈయన జన్మించారు. అందుకే తన తాత జ్ఞాపకార్థం తనకు రామయ్య అనే పేరు పెట్టారు. అయితే తనకు ఈ పేరు నచ్చకపోవడంతో తానే రామోజీ రావు అనే పేరు పెట్టుకున్నారు.చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా మొదట ఉద్యోగంలో చేసారు. అయితే 1962 లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు.ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. వ్యాపార రగంలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు.

రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. ఇక ఈయన హాలీవుడ్ తరహాలో హైదరాబాదులో కూడా ఒక ఫిలిం సిటీ నిర్మించాలన్న కోరికతోనే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ నిర్మించారు. ఈ ఫిల్మ్ సిటీలో ఎన్నో వందల సినిమాలు షూటింగులను జరుపుకుంటూ చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు కూడా కారణమయ్యాయని చెప్పాలి.

Read More: త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా… సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్!

ట్రెండింగ్ వార్తలు