September 3, 2021
వెర్సటైల్ రానా దగ్గుబాటి నా కెరీర్‌లో స్పెషల్ మూవీ అవుతుందని ‘అరణ్య’ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు అతడి అభిమానులు. ‘బాహుబలి’తో మంచి గుర్తింపు సంపాదించాక రానా చేసిన ప్యాన్ ఇండియా మూవీ కావడం మరో కారణం. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది.
ఏనుగుల పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా ఉత్తరాదిన థియేటర్లు చాలా వరకు మూతపడటంతో హిందీ మినహా తెలుగు, తమిళ భాషలలో ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రచార ఆర్బాటాలు తప్పితే సినిమాలో విషయంలేదని మొదటి ఆటతోనే తేలిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల్లో రానా భారీ డిజాస్టర్‌ను చవిచూడాల్సి వచ్చింది. ఇక రానాతో పాటు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థను కూడా ఇది భారి దెబ్బే కొట్టింది.
తెలుగు, తమిళంలో ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ‘అరణ్య’ థియేట్రికల్ రెవెన్యూ దాదాపు జీరో అయిపోయింది.
ఆ భారాన్ని కొద్దిగా పూడ్చుకునే పరిస్థితిలో పడింది ఈరోస్ సంస్థ. ఈ నెల 18న అరణ్య సినిమాను జీ సినిమా మరియు ఈరోస్ ఓటీటీల్లో విడుదలచేసే ఆలోచనలో ఉంది. ఈ డిజాస్టర్ మూవీకి ఓటీటీలో ఏమాత్రం రెస్పాన్స్ వస్తుందో చూడాలి.