కొత్త షో ద్వారా రాబోతున్న రానా, రికార్డులు బద్దలు కావాల్సిందేనా?

March 21, 2024

కొత్త షో ద్వారా రాబోతున్న రానా, రికార్డులు బద్దలు కావాల్సిందేనా?

రానా పరిచయం అవసరం లేని పేరు దగ్గుబాటి వారసుడిగా లీడర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రానా అనంతరం వరస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉంటే విలన్ పాత్రలలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఇప్పటికీ ఎన్నో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇకపోతే రానా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించారు. అదేవిధంగా పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే .ఈయన గతంలో కూడా ఒక కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు అయితే త్వరలోనే మరో కార్యక్రమానికి హోస్ట్ గా రానా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వారు నిర్వహిస్తున్నటువంటి ది రానా కనెక్షన్ అనే పాన్ ఇండియా షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ విషయాన్ని ఇటీవల అమెజాన్ వారు వెల్లడించారు. ఇదివరకు ఎన్నో టాక్ షోలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఆ టాక్ షోలు కేవలం ఆ భాష వరకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఈ టాక్ షో మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో సౌత్ సెలబ్రిటీలతోపాటు నార్త్ సెలెబ్రెటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా రానా సెలబ్రిటీల అందరిని కూడా ఆహ్వానించి వారి నుంచి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను రాబట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక రానా పోస్ట్ చేయబోతున్నటువంటి ఈ షో ఇదివరకే ప్రసారమైనటువంటి పలు కార్యక్రమాల రికార్డులను కూడా బద్దలు కొడుతుందని చెప్పాలి.

Read More: బాలయ్య కోసం హిట్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న బాబి.. వర్క్ అవుట్ అయ్యేనా?

ట్రెండింగ్ వార్తలు