Rana Daggubati: నా గురించి అడగాలంటే ఆ అవయవాలు దానం చేయండి: రానా

February 28, 2024

Rana Daggubati: నా గురించి అడగాలంటే ఆ అవయవాలు దానం చేయండి: రానా

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడో తరానికి చెందిన వ్యక్తిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు దగ్గుబాటి రానా. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన స్టైల్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. మాది దగ్గుబాటి ఫ్యామిలీ, హీరోగా తప్పితే నేను వేరే క్యారెక్టర్లు చేయను అంటూ భీష్మించుకుని కూర్చోకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఏది వచ్చిన చేస్తూ తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.

బాహుబలి లో ప్రతి నాయకుని పాత్ర పోషించి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు రానా. బయటికి ఎంతో హ్యాండ్సమ్ గా ఎంతో యాక్టివ్గా కనిపించే రానాకి ఒక ఆరోగ్య సమస్య తీవ్రంగా వేధించింది, కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. అలాగే ఒక కన్ను కూడా అతనికి పనిచేయదు.కిడ్నీ మార్పిడి తర్వాత రానా సన్నబడి పోవడంతో అభిమానులు సైతం షాక్ అయ్యారు. అయితే గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలో పాల్గొన్న రానా తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కొన్నేళ్ళ క్రితమే తనకు కిడ్నీ మార్పిడి జరిగిందని, చిన్న వయసులోనే కన్ను ఆపరేషన్ జరిగినట్లు చెప్పాడు.

మనం ప్రాణాంతకమైన స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని భిన్నమైన కోణంలో చూస్తాము, ఇక నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడిగినప్పుడు ఎంతో కష్టంగా అనిపించేది. నా ఆరోగ్యం గురించి ఎవరైనా అడగాలి అనుకుంటే కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి లేదంటే అడిగే అవసరం లేదు. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని తెలిసినప్పుడు నన్ను నేను భిన్నంగా చూడటం మొదలు పెట్టాను.

అప్పటివరకు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి అనుకున్నది మధ్యలోనే వదిలేసాను. అరణ్య సినిమా షూటింగ్ కోసం సంవత్సరం పాటు అడవిలోనే నివసించాను. ఆరోగ్యం బాగో లేకపోయినా నన్ను అక్కడ ఎవరూ పట్టించుకునేవారు లేరు. అయితే అక్కడి సహజ సిద్ధ వాతావరణం నాకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రకృతికి మించిన వైద్యం లేదని అర్థమైంది అని చెప్పుకొచ్చాడు రానా.

Read More: ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ… పెళ్లెప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు