నెటిజన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. పిల్లల్ని కనగానే సరిపోదంటూ?

May 15, 2024

నెటిజన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మీ.. పిల్లల్ని కనగానే సరిపోదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో పాటు పలు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది. సినిమాలు అనుకున్న విధంగా రష్మికి కలిసి రాలేదు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటో షూట్స్ తో యువతకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

జంతువులకు హాని కలిగించే విధంగా బాధ కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఎటువంటి వీడియో వైరల్ అయినా కూడా వెంటనే ఆ వీడియో పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే గతంలో ఇలా జంతువుల వీడియోలపై స్పందిస్తూ లేనిపోని కాంట్రవర్సీలో చిక్కుకున్న రష్మీ తాజాగా మరోసారి మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. అసలేం జరిగిందంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని తాండూర్ లో వీధి కుక్కల దాడిలో ఒక బాలిక మరణించింది. దీనిపై రష్మీ గౌతమ్ స్పందించారు. మరలా ఆమెకు నెటిజెన్స్ తో సోషల్ మీడియా వార్ షురూ అయ్యింది.

దాంతో ఒక నెటిజన్ నీ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఒక బిడ్డ కంటే కూడా కుక్కకు నువ్వు ఎలా ప్రాధాన్యత ఇస్తావ్? నీవి మానవత్వం లేని మాటలు.. అని కామెంట్ చేశాడు. ఈ కామెంటుకి సమాధానంగా రష్మీ గౌతమ్.. నేను తల్లి దండ్రులు బాధ్యతగా ఉండాలని చెప్తున్న అని కామెంట్ చేసింది. అంటే పిల్లలను కనగానే సరిపోదు వాళ్ళను భద్రంగా పెంచే బాధ్యత తల్లిదండ్రులదే అని రష్మీ పరోక్షంగా చెప్పకనే చెప్పింది. ఆమె కామెంట్ వైరల్ అవుతోంది. కొందరు రష్మీ మాటలను సమర్థిస్తుండగా మరికొందరు తప్పు పడుతూ ఆమెపై మండిపడుతున్నారు.

Read More: గొప్ప మనసును చాటుకున్న హీరో ధనుష్.. అందుకోసం కోటి రూపాయలు విరాళం?

ట్రెండింగ్ వార్తలు