Rashmika Mandanna: బేబీ డైరెక్టర్‌తో ఆ పాత్రలో నటించాలని ఉంది

May 28, 2024

Rashmika Mandanna: బేబీ డైరెక్టర్‌తో ఆ పాత్రలో నటించాలని ఉంది

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన గం గం గణేశా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటి రష్మిక మందన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈమెతో పాటు బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో భాగంగా నటి రష్మిక మందన్న బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ తాను బేబీ సినిమా మొదటిసారి చూసినప్పుడు చాలా ఏడ్చానని తెలిపారు. సినిమా చూసాక మీతో సినిమా చేయాలని అనుకున్నాను. అలాంటి సినిమా చేయడం అంత ఈజీ కాదు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ నాకు తెలుసు. అందుకే మీతో సినిమా చేయాలనీ ఒక మెంటల్ క్యారెక్టర్ చేయాలనిపించిందనీ రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

మరి రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ సినిమా చేయాలని అడగడం సాయి రాజేష్ తనకు ఒక మెంటల్ పాత్రతో ఉన్న సినిమా అవకాశాన్ని తీసుకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Read More: ఆ పనికి టైమ్ అస్సలు లేదు.. రష్మిక మందన్నా స్టోరీ వైరల్!

ట్రెండింగ్ వార్తలు