ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక కామెంట్స్ వైరల్!

May 28, 2024

ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక కామెంట్స్ వైరల్!

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి నటుడు ఆనంద్ దేవరకొండ త్వరలోనే గం గం గణేశా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మేము 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమానికి సినీనటి నేషనల్ రష్మిక మందన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆనంద దేవరకొండ రష్మిక మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రష్మిక తన పెట్స్ తో ఉన్న ఫోటోలను చూపించగా వాటి గురించి రష్మిక ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ఆరా రష్మిక పెట్ డాగ్.. తన ఫస్ట్ బేబీ అని.. స్మార్ట్ విజయ్ పెట్ డాగ్ తన సెకండ్ బేబీ అని చెప్పడం గమనార్హం. అలాగే నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అంటూ ఆనంద్ అడగడంతో.. మైక్ పక్కన పెట్టేసి నీ యబ్బ అంటూ సరదాగా తిట్టింది. ఆ తర్వాత వెంటనే మైక్ లో ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ లో పెడితే ఎలా అంటూ రష్మిక మాట్లాడటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ పెద్ద ఎత్తున కేకలు వేశారు.

నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అనే ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తన ఫేవరెట్ కోస్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటూ సమాధానం చెప్పారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు కూడా పలు సినిమాలలో నటించారు. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తరచు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వకపోయినా పలు సందర్భాలలో వీరి రిలేషన్ గురించి ఇలా పరోక్షంగా కామెంట్లు చేయడంతో మరోసారి వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

Read More: వింత వ్యాధితో బాధపడుతున్న పుష్ప విలన్… బ్రతికినంతకాలం బాధ తప్పదా?

ట్రెండింగ్ వార్తలు