ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తా.. డైరెక్టర్ కి రష్మిక కండిషన్!

June 6, 2024

ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తా.. డైరెక్టర్ కి రష్మిక కండిషన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో ఈయన వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించగా ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కే జి ఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించారు కానీ ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోలేదు.

ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. అయితే తాజగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రష్మిక హీరోయిన్గా తీసుకోవాలని ప్రశాంత్ భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి రష్మికతో సంప్రదింపులు చేయగా ఆమె మాత్రం ఒక కండిషన్ పెట్టారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ సినిమాలో నటించిన అభ్యంతరాలు లేవు కానీ ఈ సినిమాలో మాత్రం తాను డీ గ్లామర్ పాత్రలో చేయనని చెప్పేసారట ఈ కండిషన్ కి ఒప్పుకుంటే ఈ సినిమాలో నటిస్తానని తెలిపారు. ఇప్పటికే ఆమె పుష్ప సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో మరో సినిమాలో డీ గ్లామర్ పాత్ర అంటే తాను చేయననే కండిషన్ పెట్టారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఈమె 7 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Read More: పవన్ మూవీ జర్నీ పై స్పెషల్ వీడియో చేసిన అకీరా.. ఖుషీ అవుతున్న మెగా ఫాన్స్?

ట్రెండింగ్ వార్తలు