బర్త్ డే స్పెషల్ పుష్ప 2 రష్మిక లుక్ వైరల్ …శ్రీవల్లి చాలా రిచ్?

April 5, 2024

బర్త్ డే స్పెషల్ పుష్ప 2 రష్మిక లుక్ వైరల్ …శ్రీవల్లి చాలా రిచ్?

రష్మిక మందన్న నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈమె నటిస్తున్నటువంటి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మిక ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి పుష్ప సినిమా సీక్వెల్స్ చిత్రం షూటింగ్ పనులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ కి సంబంధించినటువంటి పోస్టర్స్ విడుదల చేశారు. ఇందులో భాగంగా రష్మిక ఖరీదైన చీర కట్టుకొని ఒంటినిండా నగలు వేసుకొని కనిపించారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమాలో ఒక పేదింటి అమ్మాయిగా ఉన్నటువంటి ఈమె పుష్ప 2లో మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోని విడుదల చేసినటువంటి మేకర్స్ హ్యాపీ బర్త్డే రష్మిక అంటూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో పుష్పరాజు భార్యగా రష్మిక ఓ రేంజ్ లో నటించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల సైతం ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి… వైరల్ అవుతున్న ఫోటో!

ట్రెండింగ్ వార్తలు