రష్మిక మందన్న చెల్లెలిని చూశారా… ఎంత క్యూట్ గా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో!

May 3, 2024

రష్మిక మందన్న చెల్లెలిని చూశారా… ఎంత క్యూట్ గా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు తమిళ చిత్రాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యారు.

ఈ విధంగా రష్మిక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి కూడా చాలా సమయం కేటాయిస్తారనే సంగతి మనకు తెలిసిందే. అప్పుడప్పుడు ఈమె తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన ఫ్యామిలీ గురించి ఎన్నో సందర్భాలలో చెబుతూ వచ్చారు. ఇక ఈమెకు ఓ బుల్లి చెల్లి కూడా ఉంది అనే సంగతి మనకు తెలిసిందే.

రష్మికకు 9 సంవత్సరాల చెల్లెలు ఉన్నారు. ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న. మే 2న తన చిన్నారి చెల్లి బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్ చేస్తూ చెల్లికి విషెస్ తెలిపింది రష్మిక. అలాగే తన బర్త్ డే సెలబ్రెషన్స్ మిస్ అవుతున్నానంటూ రాసుకోచ్చింది. ఇలా తన చెల్లెలితో కలిసి ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. రష్మికకు మరి ఇంత చిన్న చెల్లెలు ఉందా అంటూ కామెంట్లో చేయగా మరికొందరు ఈ చిన్నారి చాలా క్యూట్ గా ఉందని అప్ కమింగ్ హీరోయిన్ అంటూ కూడా ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

Read More: బన్ని స్టెప్పులకు ఫిదా అయినా డేవిడ్ వార్నర్.. ఇది సులభం అంటూ రియాక్ట్ అయిన అర్జున్!

ట్రెండింగ్ వార్తలు