ఇంగ్లీష్ లో మాట్లాడి అగౌరవ పరచలేను..అందుకే మాట్లాడను: రష్మిక మందన్నా

May 30, 2024

ఇంగ్లీష్ లో మాట్లాడి అగౌరవ పరచలేను..అందుకే మాట్లాడను: రష్మిక మందన్నా

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి రష్మిక మందన్న ఒకరు. కన్నడ సినీనటి అయినప్పటికీ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నారు. తెలుగులోకి ఛలో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో అవకాశాలు అందుకున్నటువంటి రష్మిక ప్రస్తుతం నేషనల్ క్రష్ మారిపోయారు.

రష్మిక ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకులకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది. ఇలా తన సినిమా పనులలో మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమా ఈవెంట్లలో కూడా రష్మిక సందడి చేస్తూ ఉంటారు.

ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తెలుగులో మాట్లాడుతూ సందడి చేశారు. అయితే ఈమె మాట్లాడిన తెలుగు అర్థం కాని ఒక నెటిజన్ సినిమా ఈవెంట్లలో ఇంగ్లీషులో మాట్లాడొచ్చు కదా అంటూ X ద్వారా రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై స్పందించిన రష్మిక తనకు ఇంగ్లీషులో మాట్లాడటం నచ్చదని తెలిపారు.

ఎంతో మంది అభిమానులు నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు.అందుకే నాకు భాష రాకపోయినా కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను.ఇంగ్లిష్ లో మాట్లాడి వారిని అగౌరవపరచాలని నేను కోరుకోనని రష్మిక సినిమా ఈవెంట్లలో ఇంగ్లీషులో మాట్లాడకపోవడానికి గల కారణాలను తెలుపుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: శర్వానంద్ కాళ్లకు నమస్కరించిన హీరో కార్తికేయ… ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు