ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ అందుకోబోతున్న బ్యూటీ.. లక్ అంటే ఇదే?

June 3, 2024

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ అందుకోబోతున్న బ్యూటీ.. లక్ అంటే ఇదే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకొని ఇటీవల నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రకటించి కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకోవాలని అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నాయని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రశాంత్ తన డ్రీం ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయాన్ని తెలియ చేయటంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందనే విషయం తెలియగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం గురించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక నటించబోతున్నారని ఆమె అయితే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని మేకర్స్ భావించినట్టు సమాచారం. ఇప్పటికే రష్మిక వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ తో ఇప్పటివరకు నటించలేదు దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మికను తీసుకోవాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది మరి ఎన్టీఆర్ తో నటించడానికి ఓకే అంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Read More: ప్రభాస్ ఆ పని చేస్తే తనతో సినిమా చేస్తా… సాహో బ్యూటీ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు