June 4, 2024
ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా లీడింగ్ తో దూసుకెళ్తుండడంతో ఇప్పటికే అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాగా ఇప్పటికే జనసేన కొన్ని సీట్లు గెలుచుకుంది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు.
దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ గెలుపుతో సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోలు, సినీ ప్రముఖులు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ లో మూవీ యూనిట్ టపాసులు కాల్చి, డ్యాన్సులు చేసి సంబరాలు చేసుకున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నాడు.
దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలు చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాట్స్ ఎమ్మెల్యే గారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.
Read More: పవన్ పై అలాంటి కామెంట్స్ చేసిన శ్యామల.. యాంకర్ కు కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్ కె ఎన్?