MrBachchan Twitter Review: ర‌వితేజ‌-హ‌రీశ్ శంక‌ర్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

August 14, 2024

MrBachchan Twitter Review: ర‌వితేజ‌-హ‌రీశ్ శంక‌ర్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌,ఎనర్జిటిక్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌..ఓన్లీ హోప్ అనేది ఉప శీర్షిక‌. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మంచి అంఛ‌నాలే ఏర్ప‌డ్డాయి. మొద‌టి సినిమా రిలీజ్ కు ముందే భాగ్య‌శ్రీ‌కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. మ‌రి ఈ సినిమా లో రవితేజ- హరీశ్ శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా? లేదా అనేది చూద్దాం.

ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి అవినీతి సొమ్ము వెలికి తీయడం అనేది ఈ సినిమా ముఖ్య క‌థాంశం. 1981లో మాజీ ఎంపీ మరియు ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త ఇంట్లో జ‌రిగిన ఇండియాలోనే అతి పెద్ద ఇన్‌క‌మ్ ట్యాక్స్ రైడ్‌ని స్పూర్తిగా తీసుకుని బాలీవుడ్‌లో రైడ్‌ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా తెర‌కెక్కిన రైడ్ చిత్రానికి భారీగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ని జోడించి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. మ‌రి ఈ సినిమా గురించి ట్విట్ట‌ర్‌లో ప్రేక్ష‌కుల రెస్పాన్స్ ఎలా ఉందంటే?

సినిమా అంటే ఇది..హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ అంటే ఇది..ర‌వితేజ యాక్టింగ్ అంటే ఇది..కామెడీ అంటే ఇలా ఉండాలి, ఇప్ప‌టి వ‌ర‌కూ మీరు తీసిన సినిమాలు అన్నీ ఈ సినిమా ముందు జుజుబీ హ‌రీష్‌గారు అంటూ ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు

#MrBachchan అనేది కాలం పాత‌కాలం నాటి కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఇది #Raid సినిమాలోని కోర్ ఎమోష‌న్ మిస్ అయింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోషెంట్ కొన్ని చోట్ల మాత్రమే పని చేస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్‌ని హైలైట్ చేయడమే దర్శకుడి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ మ‌రో నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు