భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన రవితేజ?

May 27, 2024

భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన రవితేజ?

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉన్నటువంటి ఈయన అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటించారు. అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా హీరోగా విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న రవితేజ ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరు కూడా సాధించని ఘనత సాధించారు. ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. అయితే.. తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. సైన్ ల్వాంగేజ్‌లో ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

ఈ విధంగా ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఏ సినిమా కూడా సైన్ లాంగ్వేజ్ ఓటీటీలో విడుదల కాలేదు ఇలా విడుదలవుతున్నటువంటి మొట్టమొదటి సినిమా టైగర్ నాగేశ్వరరావు కావటం విశేషం. ఈ చిత్రంలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ.. కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి. ఇలా రవితేజ నటించిన ఈ సినిమా ఇలాంటి అరుదైన ఘనత సాధించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: పవన్, ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పిన డైరెక్టర్ సుజీత్.. మల్టీ స్టారర్ డ్రీమ్ అంటూ!

Related News

ట్రెండింగ్ వార్తలు