రీమేక్‌ అంటే రవితేజ పేరే వినిపిస్తోందిగా..

July 21, 2023

రీమేక్‌ అంటే రవితేజ పేరే వినిపిస్తోందిగా..

అదెంటో కానీ మూడేళ్లుగా తెలుగు రీమేక్‌ అంటే రవితేజ పేరునే వినిపిస్తోంది. ఆరేళ్ల క్రితం తమిళంలో హిట్‌ సాధించిన ‘విక్రమ్‌వేదా’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తారనగానే మొట్టమొదట వినిపించిన పేరు రవితేజ.ఘా తర్వాత ఏమైందో కానీ ‘విక్రమ్‌ వేదా’ తెలుగు రీమేక్‌ ఆగిపోయింది. కానీ హిందీలో మాత్రం రీమేక్‌ చేశారు. హృతిక్‌రోషన్‌, సైఫ్‌అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అక్కడ ఆశించిన స్థాయి విజయం దక్కలేదు అన్న మాట మాత్రం వాస్తవం.

కోలీవుడ్‌లోని మరో హిట్‌ ఫిల్మ్‌ ‘తేరీ’. ఈ సినిమా తెలుగు రీమేక్‌కు తొలుత రవితేజ పేరు వినిపించింది. కానీ ఫైనల్‌గా ఈ సినిమాను పవన్‌కళ్యాణ్‌ చేస్తున్నాడు. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీమూవీమేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే పవన్‌ ప్రస్తుత పొలిటికల్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యే చాన్సెస్‌ ఉన్నాయి.

హిట్‌ కొట్టిన మరో తమిళ చిత్రం ‘మానాడు’. తమిళంలో శింబు హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ కొట్టింది. ఇదే సినిమాను తెలుగులో లూప్‌గా డబ్బింగ్‌ చేయాలనుకున్నారు. కానీ కట్‌ చేస్తే…‘మనాడు’ తెలుగు రీమేక్‌ రైట్స్‌ రానా వద్దకు చేరాయి. అయితే ‘మనాడు’ తెలుగు రీమేక్‌లో రవితేజ, హిందీ రీమేక్‌లో వరుణ్‌ధావన్‌ నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఎందుకో కానీ ముందుగా వరుణ్‌ధావన్‌తోనే హిందీలో రీమేక్‌ చేయాలని రానా ప్లాన్స్‌ రెడీ చేశారని తెలి సింది.

అజయ్‌దేవగన్‌ కెరీర్‌లో వన్నాఫ్‌ ది హిట్స్‌గా నిలిచిన చిత్రం ‘రైడ్‌’. 2021లో ఈ చిత్రం విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  గతంలో నాగార్జున హీరోగా రైడ్‌ తెలుగు రీమేక్‌ వస్తుందనే టాక్‌ వినిపించింది. కానీ రవితేజ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ‘రైడ్‌’ తెలుగు రీమేక్‌లో రవితేజ హీరోగా చేస్తారని, హరీష్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. గతంలో రవితేజ-హరీష్‌శంకర్‌ కాంబినేషన్‌లో ‘షాక్‌’, ‘మిరపకాయ్‌’ వంటి సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే.  ఇలా…ఇంకెన్నీ రీమేక్స్‌లో రవితేజ పేరు వినిపిస్దుందో, అసలు ఏ రీమేక్‌ సెట్స్‌పైకి వెళ్తుందో రవితేజకే తెలియాలి.

Read More: దర్శకులకు షాక్‌ ఇస్తున్న రానా

ట్రెండింగ్ వార్తలు