కల్కి ఈవెంట్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అందుకోసమే పెళ్లి చేసుకోలేదంటూ ఎక్స్ప్లనేషన్!

May 23, 2024

కల్కి ఈవెంట్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అందుకోసమే పెళ్లి చేసుకోలేదంటూ ఎక్స్ప్లనేషన్!

మే 22వ తేదీ రాత్రి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో కల్కి కి సంబంధించిన ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ పేరు బుజ్జి.ఈ ఈవెంట్లో బుజ్జిని లాంచ్ చేస్తూ ప్రభాస్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్ ని అలా చూడగానే కల్కి భైరవ లుక్ లో అదిరిపోయాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆయనకి అశ్విని దత్ ఆహ్వానం పలికారు.

బుజ్జి కి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈవెంట్లో ప్రభాస్ ఆ వెహికల్ ని స్వయంగా డ్రైవ్ చేసుకొని వచ్చి గ్రౌండ్ లో రౌండ్స్ వేశారు. ఆ తర్వాత ఒక క్రేన్ మీద నిలబడి అందరికి అభివాదం చేస్తూ తన స్పీచ్ ప్రారంభించారు. గ్లింప్స్ బాగున్నాయా అని అందరిని అడిగారు. ఈవెంట్ కి తక్కువ మందిని ఫ్యాన్స్ ని పిలిచి ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి కారణం మీ సేఫ్టీ. మీ సేఫ్టీ కోసమే ఇదంతా చేసాము అని చెప్పి ప్రేక్షకులకి సారీ చెప్పారు.

ఆ తర్వాత కమల్ హాసన్, అమితాబచ్చన్ ల గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరితో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ సర్ వేసుకున్న బట్టలు లాంటివి కావాలని మా అమ్మని అడిగాను కానీ ఇప్పుడు ఆయనతోనే యాక్ట్ చేశాను అన్నారు.ఈ వయసులో కూడా అశ్విని దత్ గారు సినిమా కోసం పడుతున్న తపన నిజంగా చాలా గ్రేట్.

అశ్విని దత్ కూతుర్లు ఇద్దరికీ సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి అందరికీ చెప్పి వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని సలహా ఇస్తాను అని చెప్పారు. అలాగే తన లేడీ ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని అన్నారు. అయితే ప్రభాస్ స్పీచ్ సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది డార్లింగ్ స్పీచ్ చూసి ఫ్యాన్స్ ఆనంద పోతున్నారు. ఎప్పుడూ మొహమాటంగా రెండు ముక్కలు మాట్లాడే ప్రభాస్ ఈసారి సరదాగా చాలాసేపు మాట్లాడటం తో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Read More: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడంటే!

Related News

ట్రెండింగ్ వార్తలు