ఆస‌క్తిక‌రంగా రెజీనా క‌సాండ్ర‌ – నివేదా థామస్ ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్ పోస్టర్‌..

December 13, 2021

ఆస‌క్తిక‌రంగా రెజీనా క‌సాండ్ర‌ – నివేదా థామస్ ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్ పోస్టర్‌..

రెజీనా క‌సాండ్ర‌, నివేదా థామస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం శాకిని డాకిని. ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో రెజీనా, నివేదా ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు.

మిస్ గ్రానీ సినిమా యూనివర్సల్ కథ కావడంతో ఓ బేబీగా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిడ్ నైట్ రన్నర్స్ కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు