మోడీని కలిసిన పవన్ కూతురు ఆద్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

June 13, 2024

మోడీని కలిసిన పవన్ కూతురు ఆద్య.. ఎమోషనల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్!

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించారు. ఇలా ఈయన ఎన్నికలలో గెలిచిన సమయం నుంచి తన పిల్లలిద్దరూ కూడా మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యారు. ముఖ్యంగా అకీరా అయితే తన తండ్రి విజయం సాధించడం మరుక్షణం నుంచి తన తండ్రి వెంటే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ సైతం తన కొడుకుని వెంటపెట్టుకొని చంద్రబాబు నాయుడుతో పాటు నరేంద్ర మోడీని కూడా కలసి వారికి పరిచయం చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాను అందరికీ పరిచయం చేయడం పట్ల రేణు దేశాయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా తన కుమారుడితో పాటు కుమార్తె ఆధ్యా కూడా వెళ్లిన సంగతి మనకు తెలిసిందే వీరిద్దరూ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఇక ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి నరేంద్ర మోడీతో ఫోటోలు దిగారు. అయితే అకీరా తన చెల్లెలు ఆద్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పరిచయం చేసారు. ఆమె కూడా రెండు చేతులు జోడించే ప్రధానమంత్రికి నమస్కారం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన రేణు దేశాయ్ తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేను గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ వ్యక్తిగా ఉంటున్నాను ఇప్పటివరకు నరేంద్ర మోడీని కలవలేదు కానీ తన తండ్రి ద్వారా నా పిల్లలు నరేంద్ర మోడీని కలవడం చాలా సంతోషంగా ఉందని తన అన్నయ్య చెల్లెల్ని ఇలా మోడీ గారికి పరిచయం చేయడం చూస్తుంటే తల్లిగా తనకెంతో సంతోషంగా ఉంది అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా అకీరా ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆధ్య వెళ్లలేదు అయితే అదే రోజు ఆమెకు స్కూల్ ఓపెన్ కావడంతో వెళ్లలేక పోయిందని క్లారిటీ ఇచ్చారు.

Read More: అల్లు అర్జున్ జంటను అన్ ఫాలో చేసిన మెగా మేనల్లుడు?

ట్రెండింగ్ వార్తలు